ఇదెందుకంటే...
వార్తా పత్రికల్లో ముద్రా రాక్షసాలు సహజం. పాత్రికేయ విలువల్ని మంటగలిపే రాక్షస ముద్రణలు నిషిద్ధం. 'వై.ఎస్.వలన, వై.ఎస్.చేత, వై.ఎస్.కొరకు'గా వై.ఎస్.తనయుడి సారథ్యంలో పుట్టి, ఫ్యాక్షనిజ నైజానికి సాక్షీభూతంగా నిలుస్తున్న పత్రికలో- 'ఏది నిజం' అంటూ పెడుతున్న కుటిల రాజకీయ పెడబొబ్బలు సచ్ఛీల పాత్రికేయ విలువలకు సిలువ వేసే దుస్తంత్రమే. వక్రమా వక్రమా ఎందుకు పుట్టావంటే సక్రమంగా ఉన్నవాళ్లను వెక్కిరించడానికి అన్నదట. ఆ కళలో అవక్ర విక్రమంగా చెలరేగిపోతూ- వై.ఎస్.సర్కారు దగాకోరు ధోరణుల్ని ప్రజలపక్షాన నిలదీస్తున్నందుకు 'ఈనాడు'పై అవాకులూ చెవాకులతో సాక్షి ఏది నిజం అంటూ దురావేశపడిపోతోంది. ఎప్పటికప్పుడు గాలి రాతలు, అసత్యాల ఎత్తిపోతలతో మాటల్లో దట్టించిన విషం సాక్షిగా, విషయాన్ని పక్కదారి పట్టిస్తోంది. 'ఈనాడు'పై గల ఆక్రోశాన్ని అక్షరాల్లో పొదిగి స్వోత్కర్ష, పరనిలతో పేరాలు నింపి, కడుపుమంట తీర్చుకోవడం కాదు పాత్రికేయమంటే! పత్రికలో కాలాలకొద్దీ 'ఈనాడు'పై కాలకూటం చిమ్మడమే సాక్షి ఏకైక అజెండా. వై.ఎస్.సర్కారు తప్పొప్పుల్ని ఎత్తిచూపుతూ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా అసిధారావ్రతం చేస్తున్నందుకే- 'ఈనాడు' విశ్వసనీయతను దెబ్బతీయాలన్న దురుద్దేశంతో సాగుతోంది దమనకాండ! 'ఏటి వంకలు ఎవరు తీరుస్తారు, కుక్క తోకను ఎవరు చక్క చేస్తారు' అన్న వివేచనతో 'ఈనాడు' ఎంతో కాలం సంయమనం పాటించింది. సాక్షి కుటిల సవాళ్లకు ఎప్పటికప్పుడు సరైన జవాబు ఇవ్వగలిగి ఉండీ- 'ఈనాడు' పాఠకజన కోటి ఆశించేది అది కాదని తెలుసు కాబట్టే సాక్షి ఆగడాలను చాలాకాలం చూసీ చూడనట్టు ఊరుకొంది. అదే అలుసుగా రెచ్చిపోతున్న వాళ్లకు నిజం నిప్పులాంటిదని, దాన్ని గుప్పిట పడితే చేయి కాలుతుందని ఇక తెలియజెప్పాలన్నదే 'ఈనాడు' సంకల్పం. సాక్షి కౌటిల్యాన్ని 'అక్షరాలా' ఖండించకపోతే ఏ కొద్దిమందైనా ఆ కథనాలే నిజమని నమ్మే ప్రమాదం ఉందని తెలిసికూడా- పాఠకదేవుళ్లకు విశిష్ట వార్తా నైవేద్యం అందించే 'ఈనాడు' పుటల్ని ఆ ఖండన మండనలకు కేటాయించరాదన్నదే మా అభిమతం. కాబట్టే- ఏది నిజమంటూ సాక్షి కడుతున్న అబద్ధాల పేక మేడల్ని పడగొట్టి, వాస్తవాల్ని విజ్ఞులైన ప్రజలముందు ఆవిష్కరించేందుకు 'ఈనాడు' ఇంటర్నెట్‌లో 'పెన్‌కౌంటర్' ప్రారంభిస్తోంది. దశాబ్దాలుగా 'ఈనాడు' పాటిస్తున్న అత్యున్నత పాత్రికేయ ప్రమాణాలకే ఇందులోనూ పెద్దపీట. తేడా అల్లా- సాక్షి చెప్పేది ఏదీ నిజం కాదని రుజువు చేసేలా మాటకు మాట, పొల్లుమాటల పోలిగాళ్లపై గురిచూసి పేల్చే వాస్తవాల తూటా!
 
    సాక్షి ఎన్ కౌ౦టర్                       ప్రచురించిన తేదీ: March 11, 2009     ఈనాడు పెన్ కౌంటర్        

రామోజీరావుగారూ! మీ లక్ష్యమేంటి?

ఒకటా... రెండా... పదా... వందా? ఎన్నిసార్లు? ఎన్నిసార్లని చెప్పాలి రామోజీరావుగారూ!! వివరణలిచ్చినా పట్టించుకోకుండా, మనసులో రాజకీయ దురుద్దేశాలు పెట్టుకుని ఒకే ఆరోపణను పదేపదే ప్రచురిస్తున్న మిమ్మల్ని...

అవినీతిని ఉపేక్షించేది లేదు!

కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడటంలేదనుకుంటుంది దొంగ పిల్లి. అధికారంలో ఉండి ప్రజాధనాన్ని ఆబగా కబళించే రాజకీయ జంగురు పిల్లులదీ అదే తీరు.

»  ఇంకా చదవండి... »  ఇంకా చదవండి...
    సాక్షి ఎన్ కౌ౦టర్                       ప్రచురించిన తేదీ: February 03, 2009     ఈనాడు పెన్ కౌంటర్        

అబద్ధానికి అక్షర రూపం... 'ఈనాడు' గ్యాస్!

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలోని ఎన్డీయే 'చక్రాన్ని' తిప్పుతున్నప్పుడే... 2003నాటికే రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.300కు చేరింది.

సాక్షి గుండెల్లో గ్యాస్ బండ!

సత్యాన్ని రాజకీయాల్లోకి ఎప్పుడైనా చొప్పించాలనుకొంటే, రాజకీయాలు కనుమరుగైపోతాయంటాడు విల్ రోగర్స్ అనే మేధావి.

»  ఇంకా చదవండి... »  ఇంకా చదవండి...
    సాక్షి ఎన్ కౌ౦టర్                       ప్రచురించిన తేదీ: January 31, 2009     ఈనాడు పెన్ కౌంటర్        

350 - 25 = 275?
వంటగ్యాస్‌పై కాకిలెక్క

''350 నుంచి 25 తీసేస్తే ఎంత? మూడో తరగతి పిల్లాడిని అడిగినా 325 అనే చెబుతాడు! 'ఈనాడు' మాత్రం 275 అని చెబుతోంది. ఎందుకిలా...?

సాక్షి కథనం చెల్లని కాసు

చౌక పత్రికగా చెప్పుకొనే సాక్షి తనకు తాను ప్రకటించుకోకపోయినా, విజ్ఞులైన పాఠకులు తేలిగ్గా గ్రహించగల వాస్తవం ఒకటుంది.

»  ఇంకా చదవండి... »  ఇంకా చదవండి...
    సాక్షి ఎన్ కౌ౦టర్                       ప్రచురించిన తేదీ: January 22, 2009     ఈనాడు పెన్ కౌంటర్        

రెండు 'ఆకులు' ఎక్కువే...
భూముల దందాలో... రాజ(య్య) గురువు

ఆకుల రాజయ్య. రామలింగరాజు. రామోజీరావు!. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందన్నది ఎంత నిజమో...

ముఖ్యమంత్రే మూలవిరాట్టు!

తనవారి కంట్లో ఉన్న దూలాలు బయట పడ్డప్పుడల్లా ఎదుటివారి కంట్లో లేని నలుసుల్ని ఎత్తి చూపడం- ఫ్యాక్షనిజం పొత్తిళ్లలో పుట్టి పెరుగుతున్న సాక్షి లక్షణం.

»  ఇంకా చదవండి... »  ఇంకా చదవండి...
    సాక్షి ఎన్ కౌ౦టర్                       ప్రచురించిన తేదీ: January 10, 2009     ఈనాడు పెన్ కౌంటర్        

'ఈనాడు'కు విలువలేవి?

సత్యాలు, ఆధారాలతో సంబంధం లేకుండా అభూత కల్పనలు, అభాండాలతో పత్రిక నడపటాన్ని జర్నలిజం అనరు. అది 'ఎల్లో' జర్నలిజమే అవుతుంది. 'బాబు భజన తప్ప జాన్తా నై...

ఫ్యాక్ష'నిజ'మేవ జయతే?

దిసమొలతో నిస్సిగ్గుగా నర్తిస్తున్న వాడు- వస్త్రధారణలో సభ్యతా ప్రమాణాలపై లెక్చర్లిస్తే జనం నవ్విపోతారు.

»  ఇంకా చదవండి... »  ఇంకా చదవండి...